TDP : పయ్యావుల, కోటంరెడ్డి, అనగాని అసెంబ్లీ సెషన్‌ మొత్తం సస్పెండ్

అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ లకు ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన చేస్తూ వీడియోస్ తీస్తున్నారని అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ ను అసెంబ్లీ హౌస్ నుండి సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మేరకు అసెంబ్లీ లో

TDP :  పయ్యావుల, కోటంరెడ్డి, అనగాని అసెంబ్లీ సెషన్‌ మొత్తం సస్పెండ్
X

TDP : అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ లకు ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన చేస్తూ వీడియోస్ తీస్తున్నారని అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ ను అసెంబ్లీ హౌస్ నుండి సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మేరకు అసెంబ్లీ లో ప్రకటన చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అలాగే... అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యులని ఒక్కరోజు, ముగ్గురిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా, చంద్రబాబు నాయుడు అరెస్టుపై అసెంబ్లీలో పోడియం వద్ద ఇవాళ ఉదయం నిరసన తెలిపారు టీడీపీ సభ్యులు. అటు అసెంబ్లీలో మీసం తిప్పారు బాలకృష్ణ. బాలకృష్ణను చూస్తూ తొడగొట్టి 'రా బయట చూసుకుందాం' అని వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. కాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుపాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.

Tags:
Next Story
Share it