Tdp: టీడీపీ పార్లమెంటరీ సమావేశం.. ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం!

ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో పార్టీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. ఈ సమావేశ

Tdp: టీడీపీ పార్లమెంటరీ సమావేశం.. ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం!
X

న్యూస్‌‌లైన్, డెస్క్: ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో పార్టీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోకేశ్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న విషయాన్ని పార్లమెంటులో బలంగా వినిపించాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను ఉభయసభల దృష్టికి తీసుకెళ్లేలా టీడీపీ ఎంపీల కార్యాచరణ ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం తీసుకురాబోతున్న బిల్లులు, వాటికి టీడీపీ తరఫున వ్యవహరించాల్సిన తీరుపైనా ఎంపీలతో నారా లోకేష్ చర్చించారు.

Tags:
Next Story
Share it