Ap Politics : తెలుగుదేశం పార్టీ కేవలం 100 స్థానాల్లో మాత్రమే పోటీచేయబోతుందా?

తెలుగు దేశం పార్టీ ని పొత్తు మరోసారి ముంచేయబోతుందా..?, 2009 ఎన్నికల సమయం లో జరిగిందే మళ్ళీ పునరావృత్తం కానుందా?, అసలు తెలుగు దేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే దానిపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.

Ap Politics : తెలుగుదేశం పార్టీ కేవలం 100 స్థానాల్లో మాత్రమే పోటీచేయబోతుందా?
X

న్యూస్ లైన్ , అమరావతి : తెలుగు దేశం పార్టీ ని పొత్తు మరోసారి ముంచేయబోతుందా..?, 2009 ఎన్నికల సమయం లో జరిగిందే మళ్ళీ పునరావృత్తం కానుందా?, అసలు తెలుగు దేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే దానిపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకుంది. సీట్ల పంపకం విషయం లో ఎన్నో తర్జన భర్జనలు గురై ఎట్టకేలకు ఒక నెంబర్ కి ఫిక్స్ అయ్యారు. జనసేన పార్టీ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, జనసేన 38 కి పైగా స్థానాల్లో పోటీ చేయబోతుంది అని. పవన్ కళ్యాణ్ కూడా ఎల్లుండి నుండి పోటీ చెయ్యబొయ్యే స్థానాల్లో పర్యటనలు చేపట్టబోతున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నట్టు అందరికీ స్పష్టం గా అర్థం అవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ తో పొత్తు కోసం ఈ ఇరువురి పార్టీల అధినేతలు ఎందుకు అంతలా తాపత్రయం పడుతున్నారంటే, రాబొయ్యే ఎన్నికలలో కేంద్రం లో మరోసారి బీజేపీ పార్టీ అధికారం లోకి రాబోతుండడమే. అంతే కాకుండా ఎన్నికల సమయం లో బీజేపీ ఏ పార్టీ కి మద్దతుగా ఉంటే ఆ పార్టీ కి వ్యవస్థల పరంగా మ్యానేజ్మెంట్ చెయ్యడం చాలా సులభం అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నమ్ముతున్నారు. కానీ పొట్టులోకి అడుగుపెట్టేందుకు బీజేపీ డిమాండ్ చేస్తున్న సీట్లు చూసి చంద్రబాబు నాయుడు కి మైండ్ బ్లాక్ అయ్యినట్టు సమాచారం. ఇటీవలే చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు, ఈ భేటీ లో అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం కచ్చితంగా బీజేపీ కి ఇవ్వాలి, అలాగే 5 ఎంపీ స్థానాలు కావాలి అని అడిగారట. దీంతో చంద్రబాబు కి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి సైలెంట్ గా తిరిగి వచ్చేసాడట. ఒకవేళ బీజేపీ ప్రతిపాదనని ఒప్పుకుంటే తెలుగు దేశం పార్టీ పోటీ చేసే స్థానాలు వంద కి కుదించుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:
Next Story
Share it