Pithapuram : టీడీపీ కి రాజీనామా చేసిన పిఠాపురం అభ్యర్థి వర్మ!

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యం లో పిఠాపురం స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ స్థానం నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం.

Pithapuram : టీడీపీ కి రాజీనామా చేసిన పిఠాపురం అభ్యర్థి వర్మ!
X

న్యూస్ లైన్, పిఠాపురం : ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యం లో పిఠాపురం స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ స్థానం నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ స్థానం లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కచ్చితంగా సపోర్టు చేస్తానని, లక్ష మెజారిటీ తో గెలిపిస్తానని టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ అప్పట్లో చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన మెల్లగా తన స్వరం మార్చారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి పోటీ చెయ్యరని, ఈ సీట్ కచ్చితంగా నాదే అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండే చేస్తారని ఖరారు కావడంతో వర్మ టీడీపీ కి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారట. ఒకవేళ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలవడం చాలా కష్టమని పిఠాపురం నుండి వినిపిస్తున్న వార్త. మరోపక్క వైసీపీ నుండి ముద్రగడ్డ పద్మనాభం ని పోటీ చేయించడానికి సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వైపులా పవన్ కళ్యాణ్ కి ఈ సీటు చాలా కష్టమైంది అని అంటున్నారు విశ్లేషకులు.

Tags:
Next Story
Share it