Kakinada : వైసీపీ లోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పర్వం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు కానీ, రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అనేక దఫాలుగా వైసీపీ పార్టీ అభ్యర్థుల జాబితాని విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 24 వ తేదీన టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాని కూడా అధికారికంగా ప్రకటించారు.

Kakinada : వైసీపీ లోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు!
X

న్యూస్ లైన్,కాకినాడ : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పర్వం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు కానీ, రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అనేక దఫాలుగా వైసీపీ పార్టీ అభ్యర్థుల జాబితాని విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 24 వ తేదీన టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాని కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ జాబితా లో టికెట్ రాని నాయకుల నుండి ఇరు పార్టీలలో అసమ్మతి ఏర్పడింది. కొంతమంది నాయకులూ టీడీపీ, జనసేన పార్టీలను వీడి వైసీపీ లోకి చేరుతున్నారు.

ఇప్పుడు టీడీపీ ముఖ్య నేత గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీ ని వీడి వైసీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే పొత్తులో భాగంగా తెలుగు దేశం పార్టీ కాకినాడ రూరల్ సీట్ ని జనసేన పార్టీ కి కేటాయించింది. పంతం నానాజీ ఈ స్థానం నుండి పోటీ చెయ్యబోతున్నారు. అయితే టికెట్ ని ఆశించి నిరాశ చెందిన సూర్య రావు, తెలుగు దేశం పార్టీ లో సామాజిక న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. నేడు ఆయన ఎంపీ కేశినేని నానీని ఆయన ఆఫీస్ లో సమావేశం అయ్యారు. ఎంపీలు మిథున్ రెడ్డి, కేశినేని నానితో భేటీ అయిన సూర్యరావు త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Tags:
Next Story
Share it