Rajamundry :రాజమండ్రి సభ వేదిక పై చంద్రబాబు ని తోసేసిన అభిమానులు!

సభ వేదిక మీదకి అత్యధిక స్థాయిలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రావడం తో కాస్త తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చంద్రబాబు స్టేజి మీద నుండి క్రిందకి పడిపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే ఉన్న సెక్యూరిటీ ఇది గమనించి ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

Rajamundry :రాజమండ్రి సభ వేదిక పై చంద్రబాబు ని తోసేసిన అభిమానులు!
X

న్యూస్ లైన్, రాజమండ్రి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గత కొంతకాలం నుండి 'రా..కదిలిరా' పేరుతో అనేక నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నేడు ఆయన రాజమండ్రి లోని కాతేరులో 'రా..కదలిరా' బహిరంగ సభని ఏర్పాటు చేసాడు. అయితే సభ వేదిక మీదకి అత్యధిక స్థాయిలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రావడం తో కాస్త తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చంద్రబాబు స్టేజి మీద నుండి క్రిందకి పడిపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే ఉన్న సెక్యూరిటీ ఇది గమనించి ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే అనర్హం జరిగేది. స్టేజి మీదకు ఒకేసారి అంతమంది కార్యకర్తలు, నేతలను ఎక్కించేలా చేసినందుకు చంద్రబాబు సభ నిర్వహించిన టీడీపీ నాయకులపై మండిపడ్డాడు. చంద్రబాబు ని తోసేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.



Tags:
Next Story
Share it