Revanth Reddy : తిరుపతి కాంగ్రెస్ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చెయ్యడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు అది జరగబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.

Revanth Reddy : తిరుపతి కాంగ్రెస్ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి
X

న్యూస్ లైన్, తిరుపతి : తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చెయ్యడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు అది జరగబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 25 వ తారీఖున తిరుపతిలో జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభకు హాజరు కాబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి షర్మిల న్యాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చెయ్యకముందు రేవంత్ రెడ్డి ని ఎన్నో మాటలు అన్నారు. రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో షర్మిల కి కౌంటర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ఒకే వేదికని పంచుకోబోతున్నారు. కచ్చితంగా జనాల నుండి షర్మిల కి ప్రశ్నలు ఎదురు అవుతాయి. ప్రచారాలకు వెళ్ళినప్పుడు 'నువ్వే రేవంత్ రెడ్డి ని దొంగ అని అన్నావు, ఇప్పుడు ఆయననే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం తీసుకొస్తున్నావు, దీనికి సమాధానం చెప్పండి' అని అడుగుతారు. అప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి ని దొంగ అనుకోని మోసపోయాను, ఆయన దొంగ కాదు మంచోడు అని అంటారేమో చూడాలిa

Tags:
Next Story
Share it