CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌(PIL)ను హైకోర్టు విచారించింది.

CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు
X


CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు ఏపీ సీఎం జగన్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌(PIL)ను హైకోర్టు విచారించింది. పిల్‌లోని సవరణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు(high court) సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసింది. జోగయ్య(jogaiah) తరఫున న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో జగన్(jagan), సీబీఐ(cbi), సీబీఐ కోర్టులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా ఆదేశించాలని జోగయ్య పిటిషన్‌లో కోరారు. అంతేకాదు వచ్చే 2024 అసెంబ్లీ(assembly) సమావేశాల్లోపు ఆ కేసుల పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వాలని జోగయ్య కోరారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (pil)గా పరిగణించాలని తెలంగాణ హైకోర్టు(telangana high court) అంగీకరించి ఆదేశాలు జారీ చేసింది.

హరిరామజోగయ్య(harirama jogaiah) పిల్ విషయానికొస్తే.. అయన పిటిషన్(petition) ను పిల్‌ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై చీఫ్ జస్టిస్ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. పిల్‌ కు నెంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జగన్‌ కేసుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్‌ దాఖలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలోపు కేసుల సంగతి తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it