Geetanjali: గీతాంజలి ఆత్మహత్య కేసులో ..TDP కార్యకర్త అరెస్ట్‌

ఎల్లో సోషల్‌ మీడియా ట్రోలింగ్ భరించలేక తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తనకు జగనన్న పాలనలో సొంత ఇల్లు మంజూరైందని

Geetanjali: గీతాంజలి ఆత్మహత్య కేసులో ..TDP కార్యకర్త అరెస్ట్‌
X

Tenali Geethanjali Issue: ఎల్లో సోషల్‌ మీడియా ట్రోలింగ్ భరించలేక తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తనకు జగనన్న పాలనలో సొంత ఇల్లు మంజూరైందని ఆనందాన్ని వ్యక్తం చేయడమే ఆమె చేసిన తప్పట. ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ.. ఘోరంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో ఆమె భరించలేక ఏకంగా తనువు చాలించింది. దీంతో అందరూ టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్‌ చేసారు.

అంతేకాదు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లో సోషల్‌ మీడియా ట్రోలింగ్ భరించలేక గీతాంజలి సుసైడ్‌ చేసుకుందని కూడా పోలీసులు తేల్చారట. ఇక తాజాగా గీతాంజలి కేసులో కీలక పరిణామం ఎదురైంది. గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌ అయ్యాడు. గీతాంజలి మీద జుగుప్సాకరమైన ట్వీట్లు పెట్టి ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నాయకుడు రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it