Chandrababu: సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదాలు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu naidu) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 53 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉన్నారు.

Chandrababu: సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదాలు: చంద్రబాబు
X

న్యూస్‌లైన్, డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu naidu) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 53 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇవాళ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు (High Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఆయన మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. మీ అభిమానానికి జీవితం ధన్యమైందని, 45 ఏళ్లలో ఏ తప్పు చేయ్యలేదు.. చేయ్యను.. చేయ్యబోను అని అన్నారు. సహకరించిన జనసేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు (Pawan kalyan) కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ చాలా మంది సంఘీభావం తెలిపారని చెప్పారు.

తనపై ప్రజలు చూపిన అభిమానాన్ని తాను ఏనాడూ మర్చిపోలేనని చంద్రబాబు చెప్పారు. తాను కష్టంలో ఉన్నప్పుడు మీరందరు రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. తన కోసం పూజలు, ప్రార్థనలు చేశారన్నారు. అలాగే తనకు సంఘీభావం తెలిపిన రాజకీయా పార్టీలకు బీజేపీ, సీసీఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ధన్యవాదాలు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. జైలులో నుంచి చంద్రబాబు ప్రధాన ద్వారం నుంచి వెలుపలికి వచ్చారు. చంద్రబాబు కోసం జైలు బ్యారికేడ్లను కూడా తీసుకుని వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగి పోయాయి.

Tags:
Next Story
Share it