APSRTC: స్టీరింగ్ విరగడంతో బోల్తాపడ్డ బస్సు.పాపం 20 మంది..!!

 శ్రీకాకుళం జిల్లా నుంచి పాతపట్నం వైపుగా వెళ్తున్నటువంటి జాతీయ రహదారి మీద కోమర్తి జంక్షన్ వద్దకు రాగానే  ఈ బస్సు  ప్రమాదం బారిన పడింది..

APSRTC: స్టీరింగ్ విరగడంతో బోల్తాపడ్డ బస్సు.పాపం 20 మంది..!!
X

న్యూస్ లైన్ డెస్క్, ఏపీ:ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి.. జాతీయ రహదారులపై ఎక్కడ చూసిన ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఎంతో మంది గాయాల పాలవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది మరణిస్తున్న హృదయ విదారక ఘటనలు మన కంట పడుతూనే ఉన్నాయి. తాజాగా రైలు ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం బారిన పడింది.

శ్రీకాకుళం జిల్లా నుంచి పాతపట్నం వైపుగా వెళ్తున్నటువంటి జాతీయ రహదారి మీద కోమర్తి జంక్షన్ వద్దకు రాగానే ఈ బస్సు ప్రమాదం బారిన పడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడినది. ఈ యొక్క బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపుగా వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ప్రధాన కారణం బస్సు స్పీడ్ గా ప్రయాణం చేస్తున్న సమయంలో స్టీరింగ్ విరిగి పోయిందట.

దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో కండక్టర్, డ్రైవర్ తో పాటుగా మరో 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదకడం జరగడంతోనే హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

Tags:
Next Story
Share it