Nara Lokesh: ముగిసిన లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ!

ఐఆర్‌ఆర్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. రెండో రోజు విచారణలో భాగంగా ఆయనను 6 గంటలు అధికారులు విచారణ చేపట్టారు. రెండో రోజు సీఐడీ విచారణకు హజరయ్యానని,  దాదాపు ఆరు గంటల సమయం తనను అధికారులు ప్రశ్నించినట్లు నారా లోకేష్ తెలిపారు. నిన్నటి ప్రశ్నలు మళ్లీ ఇవాళ కూడా అడిగారని చె

Nara Lokesh: ముగిసిన లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ!
X

న్యూస్‌లైన్, డెస్క్: ఐఆర్‌ఆర్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. రెండో రోజు విచారణలో భాగంగా ఆయనను 6 గంటలు అధికారులు విచారణ చేపట్టారు. రెండో రోజు సీఐడీ విచారణకు హజరయ్యానని, దాదాపు ఆరు గంటల సమయం తనను అధికారులు ప్రశ్నించినట్లు నారా లోకేష్ తెలిపారు. నిన్నటి ప్రశ్నలు మళ్లీ ఇవాళ కూడా అడిగారని చెప్పారు. విచారణలో భాగంగా 47 ప్రశ్నలు అడిగారని, కొత్తగా ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్ తనకు చూపించినట్లు వెల్లడించారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చాయని అడిగానని, మళ్లీ విచారణకు రమ్మని పిలువలేదని నారా లోకేష్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.

Tags:
Next Story
Share it