Janasena - TDP:గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Janasena - TDP:గుడివాడలో  టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట
X

Janasena - TDP: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివంగత నేత ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు వస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులను ఆయన విగ్రహం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకని ప్రశ్నించినా పార్టీ శ్రేణులు సహనం కోల్పోయారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య పోలీసులకు తోపులాట జరిగింది.

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆయనకెందుకు అనుమతి ఇచ్చారంటూ పోలీసులపై గుడివాడ టీడీపీ ఇన్ చార్జీ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి ఒక న్యాయం తమకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు. నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని అక్కడే రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు మొండికేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Tags:
Next Story
Share it