AP Politics : ఒక్కరిని ఓడించడం కోసం ముగ్గురు కలిశారు..ఇప్పటికీ భయమే!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ ఎంత పవర్ ఫుల్ లీడర్ అనేది జనాలకు చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లిద్దరికీ జగన్ ని చూసి సరిగా నిద్ర కూడా పట్టడం లేనట్టుగా అనిపిస్తుంది.

AP Politics : ఒక్కరిని ఓడించడం కోసం ముగ్గురు కలిశారు..ఇప్పటికీ భయమే!
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ ఎంత పవర్ ఫుల్ లీడర్ అనేది జనాలకు చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లిద్దరికీ జగన్ ని చూసి సరిగా నిద్ర కూడా పట్టడం లేనట్టుగా అనిపిస్తుంది. 2014 ఎన్నికలలో కూడా ముగ్గురు కలిసి జగన్ ని ఓడించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, జగన్ పాలనను అందరూ చూసారు, సంక్షేమ పథకాలలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ అమలు చేసిన పథకాలను రోల్ మోడల్ గా తీసుకునే స్థితికి వచ్చారు. వైసీపీ పార్టీ కి పేద ప్రజల మద్దత్తు గతం లో కంటే ఇప్పుడు మూడింతలు ఎక్కువ ఉంది. అందుకే జగన్ ని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ఒకపక్క సొంత సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరి, అన్నయ్య జగన్ మీద ఎన్నో విమర్శలు చేస్తూ ఉంది.

మరో పక్క రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన కలవడమే కాకుండా తమకి తోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని వెంటపెట్టుకొని వచ్చింది. ఇంతమంది పద్మవ్యూహం లాగ జగన్ చుట్టూ చేరినా ఏ మాత్రం టెన్షన్ లేకుండా జగన్ తన పనిని తానూ చేసుకుంటూ పోతున్నారు. ఆయన సిద్ధం సభలు నిర్వహించినప్పుడల్లా పవన్, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్దంకి లో ఈ నెల 10 వ తారీఖున జగన్ సిద్ధం సభని ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఈ సభకి రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభతో వచ్చే ప్రకంపనల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీపీఎం, సీపీఐ, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, చూడాలి మరి.

Tags:
Next Story
Share it