Tdpjanasena: కూటమిలో ఇంకా చల్లారని టికెట్ల కుంపటి..ఆ నేతకు ఘోర అవమానం!

ఎన్నికలకు సరిగా 40 రోజుల సమయం ఉంది. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని మర్చిపోకుండా వాళ్లకు టిక్కెట్లు కేటాయించడమే కాకుండా, సామజిక వర్గాల ప్రాతిపదికన సీట్లను ఇవ్వడంలో కూడా వైసీపీ శబాష్ అనిపించుకుంది.

Tdpjanasena:  కూటమిలో ఇంకా చల్లారని టికెట్ల కుంపటి..ఆ నేతకు ఘోర అవమానం!
X

న్యూస్ లైన్, అనంతపురం అర్బన్: ఎన్నికలకు సరిగా 40 రోజుల సమయం ఉంది. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని మర్చిపోకుండా వాళ్లకు టిక్కెట్లు కేటాయించడమే కాకుండా, సామజిక వర్గాల ప్రాతిపదికన సీట్లను ఇవ్వడంలో కూడా వైసీపీ శబాష్ అనిపించుకుంది. అందుకే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక్క నియోజకవర్గం లో కూడా నిరసన సెగలు వైసీపీ కి తగలలేదు. కానీ కూటమి విషయం లో మాత్రం ప్రతీ నియోజకవర్గం లో ఎదో ఒక అసమ్మతి సెగ ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఒకపక్క రఘురామ కృష్ణం రాజు కి సీట్ కేటాయించే విషయం లో తర్జన భర్జన పడుతున్న టీడీపీ కి, ఇప్పుడు అనంతపురం అర్బన్ మరో తలనొప్పిగా మారింది. తొలుత ఈ స్థానం లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ కోరింది. కానీ చివరికి టీడీపీ నే పోటీ చేస్తుంది.

కానీ అభ్యర్థి ఎంపిక విషయం లో తెలుగు దేశం పార్టీ అభివృద్ధి కోసం మొదటి నుండి కష్టపడుతున్న ప్రభాకర్ చౌదరీ ని కాదని దగ్గుపాటి ప్రసాద్ కి సీటుని కేటాయించారు. దీంతో భగ్గుమన్న అనంతపురం టీడీపీ క్యాడర్ ప్రభాకర్ చౌదరి కి సీటు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి ఉంటుందని, రాబొయ్యే ఎన్నికలలో టీడీపీ కి ఓటు వెయ్యము అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నిరసన సెగ ఇప్పటికీ తగ్గలేదు. దగ్గుపాటి ప్రసాద్ ఈ సీటు కోసం చంద్రబాబు నాయుడు 50 కోట్ల రూపాయిలు ఇచ్చారని, అందుకే మొదటి నుండి పార్టీ నమ్ముకున్న వ్యక్తికీ నమ్మకద్రోహం చేసారని ప్రభాకర్ చౌదరి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై చంద్రబాబు స్వయంగా రంగం లోకి దిగి ప్రభాకర్ చౌదరి ని బుజ్జగించబోతున్నారట. అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు లేవని అంటుంది అనంతపురం అర్బన్ టీడీపీ క్యాడర్.

Tags:
Next Story
Share it