Tiger Cub Death: ఎస్వీ జూలో పులి పిల్ల మృతి!

తిరుపతి జూలో పులి మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే ఈ పులి పిల్లలు రెండు నెలల కిందట తల్లికి దూరం కావడంతో తిరుపతి జూలో అధికారులు చేర్చారు.

Tiger Cub Death: ఎస్వీ జూలో పులి పిల్ల మృతి!
X

న్యూస్‌లైన్, డెస్క్: తిరుపతి జూలో పులి మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే ఈ పులి పిల్లలు రెండు నెలల కిందట తల్లికి దూరం కావడంతో తిరుపతి జూలో అధికారులు చేర్చారు. అందులో నాలుగు పులి పిల్లలు ఉండగా.. అందులో ఒకటి అనారోగ్యంతో మృతి చెందింది.

మృతి చెందిన పులి పిల్లపై పరీక్షలు నిర్వహించగా కిడ్నీ, లివర్ సమస్యలతో చనిపోయినట్టు నివేదించారు. మిగిలిన మూడు పులి పిల్లల బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు ఎస్వీ జూ అధికారులు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక, రెండు నెలల కిందట నల్లమల అడవిలో తల్లికి దూరం అయ్యాయి. పులి పిల్లల ఆలనా పాలన జూ సిబ్బంది చూస్తున్నారు. నాలుగింటిలో ఒక పులి పిల్ల ఈ కిడ్నీ, లివర్ సమస్యతో మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

Tags:
Next Story
Share it