TTD: భక్తులకు గుడ్‌న్యూస్.. మే నెల సేవా టికెట్లు, గదుల కోటా వివరాలివే

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. రేపు తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత

TTD: భక్తులకు గుడ్‌న్యూస్.. మే నెల సేవా టికెట్లు, గదుల కోటా వివరాలివే
X

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. రేపు తిరుమల (Tirumala ) శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల (Tirumala ) శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల డిప్ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదే రోజు లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈనెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జారీచేస్తారు.

ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదులకోట, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోట విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోట, మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ విడుదల చేస్తారు. ఇక ఈ టికెట్ల కోసం...Tirumala Tirupati Devasthanams (Official Website) ను సంప్రదించాల్సి ఉంటుంది.

Tags:
Next Story
Share it