Tirupathi : పొత్తు ధర్మం పాటించని తిరుపతి జనసేన నాయకలు

జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫిబ్రవరి నెల నుండి తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. కారణం జనసేన పార్టీ కి బలానికి తగ్గ సీట్లు ఇవ్వలేదని, పొత్తులో చాలా అన్యాయం జరిగిందని, ఇచ్చిన 24 సీట్లలో కూడా 3 సీట్లు బీజేపీ తీసుకుందని తీవ్రమైన అసహనంతో ఉన్నారు.

Tirupathi : పొత్తు ధర్మం పాటించని తిరుపతి జనసేన నాయకలు
X

న్యూస్ లైన్, తిరుపతి : జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫిబ్రవరి నెల నుండి తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. కారణం జనసేన పార్టీ కి బలానికి తగ్గ సీట్లు ఇవ్వలేదని, పొత్తులో చాలా అన్యాయం జరిగిందని, ఇచ్చిన 24 సీట్లలో కూడా 3 సీట్లు బీజేపీ తీసుకుందని తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబోయే స్థానం పై జనాల్లో ఉత్కంఠ నెలకొంది. చాలామంది పవన్ కళ్యాణ్ తిరుపతి స్థానం నుండి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆ స్థానం ని ఇటీవలే జనసేన పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కి టికెట్ ఇవ్వడం పై అటు తెలుగు దేశం పార్టీ నేతల్లోనూ, ఇటు జనసేన క్యాడర్ లోను తీవ్రమైన అసహనం ఏర్పడింది. దీంతో టీడీపీ -జనసేన కార్యకర్తలు ఉమ్మడిగా ఒక హోటల్ లో సమావేశమై, పొత్తు ధర్మం ని విస్మరిస్తూ ఆరని శ్రీనివాసులు కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పవన్ ముద్దు.. ఆరని వద్దు అని నినదిస్తూ పవన్ కళ్యాణ్ ని కలవడానికి మంగళగిరి జనసేన పార్టీ కి బయలుదేరారు.

Tags:
Next Story
Share it