Cm Jagan : ఇవాళ వైఎస్సార్ లా నేస్తం నిధులు

ఇవాళ వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల కానున్నాయి. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్...తాడేపల్లి క్యాంపు కార్యాలయం

Cm Jagan : ఇవాళ వైఎస్సార్ లా నేస్తం నిధులు
X

Cm Jagan : ఇవాళ వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల కానున్నాయి. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్...తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొంటారు. జూనియర్ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు ప్రభుత్వ ఆర్ధిక భరోసా అందిస్తోంది.

2023-24 సంవత్సరానికి రెండో విడత సహాయం ఇవాళ చేయనుంది. నెలకు 5 వేల రూపాయల స్టైఫండ్ ఇస్తోంది జగన్‌ సర్కార్‌. జులై - డిసెంబర్ మధ్య కాలానికి ...గత 6 నెలలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయల ఆర్ధిక సహాయం చేయనుంది. దీంతో 2,807 మందికి లబ్ది చేకూరనుంది.

ఇక లబ్దిదారుల ఖాతాల్లో సుమారుగా 8 కోట్ల రూపాయలను ఖాతాల్లో జను చేయనున్నారు సీఎం జగన్. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన మొత్తం 49. 51 కోట్లు అని అధికారులు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it