TDP: టీడీపీ అంటే తెలుగుదేశం కాదు తెలుగు డ్రగ్స్ పార్టీ !

: బ్రెజిల్ నుంచి తెప్పించిన 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో డ్రగ్స్‌ కలిపి విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో అన్ని వేళ్లూ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబా

TDP: టీడీపీ అంటే తెలుగుదేశం కాదు తెలుగు డ్రగ్స్ పార్టీ !
X

TDP: బ్రెజిల్ నుంచి తెప్పించిన 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో డ్రగ్స్‌ కలిపి విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో అన్ని వేళ్లూ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలవైపే చూపిస్తున్నాయి. డ్రగ్స్ తెప్పించడంలో పాత్రధారి సంధ్యా ఆక్వా సంస్థ ఎండీ కూనం కోటయ్య చౌదరి అయితే.. సూత్రధారులు టీడీపీ నేతలు.చంద్రబాబు, పురంధేశ్వరి, బాలయ్య చిన్నల్లుడు భరత్‌లతో ఈ వ్యాపార, వ్యక్తిగత బంధాలు ఉంటే.. టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతోనూ కోటయ్య చౌదరితో ఉన్న ఆర్థిక బంధం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌ దందాలో కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులు కాగా.. సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులే.

డ్రగ్స్ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, ఇక్కడికి చేరాక మార్కెటింగ్‌ వ్యూహం అంతా టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలదే. సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులో దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు చెంచురామ్ భాగస్వామి. ఆతర్వాత కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు.ఈ వ్యాపారం వెనుక డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ లోగుట్టు దాగుందని సీబీఐ సోదాల్లో వెల్లడవుతోంది. చంద్ర­­బాబుకు అత్యంత సన్నిహితులు, టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌ సోదరుడు), రాయపాటి జీవన్‌ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి చేస్తున్నారన్నది వెలుగులోకి వచ్చింది.

చంద్రబాబుకు దామచర్ల జనార్ధన్‌ అత్యంత సన్నిహితుడు కాగా, ఆయన సోదరుడు దామచర్ల సత్య లోకేశ్‌ కోటరీలో కీలకంగా ఉన్నాడు. వీరంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని.. ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని.. కలసి ఎంజాయ్‌ చేస్తారనే ఫొటోలు రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి. చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న ఆల­పాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలు కలిసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు తేలింది.మొత్తంగా బ్రెజిల్ నుంచి తెప్పించిన డ్రగ్స్‌ దందాలో పాత్రధారి అయిన సంధ్యా ఆక్వా కంపెనీతో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాలు, కోటరీలకు సన్నిహిత సంబంధాలున్నాయని మాత్రం స్పష్టం చేస్తున్నా­యి.

Tags:
Next Story
Share it