బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. చిరుత దాడి మృతిపై టీటీడీ ఈవో స్పందన! 

తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి బాటన చిన్నారిని చంపివేసిన చిరుత ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట

బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. చిరుత దాడి మృతిపై టీటీడీ ఈవో స్పందన! 
X

న్యూస్‌లైన్, డెస్క్: తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి బాటన చిన్నారిని చంపివేసిన చిరుత ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరం అన్నారు.

నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రికన్స్ట్రక్షన్ చేయించామని తెలిపారు. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గతంలో బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించామని తెలిపారు. నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నామని చెప్పారు. తిరుపతి నుంచి తిరుమల ఉన్న రెండు కాలిబాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు.

ఘాట్ రోడ్డులో సాయంత్రం 6:00 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని, నడక మార్గంలో ప్రతి 45 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు చేపడతామని ఈవో ధర్మారెడ్డి అన్నారు.

Tags:
Next Story
Share it