TTD : ఈ నెల 24న రూ. 300 ల టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. ఆన్ లైన్ లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ విడుదల అ

TTD : ఈ నెల 24న రూ. 300 ల టికెట్లు విడుదల
X

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. ఆన్ లైన్ లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ విడుదల అయింది. లక్కిడిఫ్ విధానంలో పొందే ఆర్జిత సేవా టికెట్ల కోసం రేపు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ.

ఇక ఎల్లుండి ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం,ఆర్జిత బ్రహ్మోత్సవం,ఉంజల్ సేవా,సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు, ఎల్లుండి మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనుంది టీటీడీ.

ఇక 23వ తేది ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, 23వ తేది మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు,వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 25వ తేది ఉదయం 10 గంటలకు తిరుమల,తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల కానున్నాయి. టిటిడి వెబ్ సైట్ www.tirupatibalaji.ap.gov.in ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది టిటిడి పాలకమండలి.

Tags:
Next Story
Share it