Chandrababu : సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి పిటిషన్

చంద్రబాబు కేసు నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేసు సీబీఐకి అప్పగించాలి అని పిల్ వేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రూ. 241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా వివరాలు పొందు పరచిన ఉండవల్లి... సీమెన్స్ ఇండియా గుజరాత్ MOUలో పెట్టిన పేరు సంతక

Chandrababu : సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి పిటిషన్
X

Chandrababu : చంద్రబాబు కేసు నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేసు సీబీఐకి అప్పగించాలి అని పిల్ వేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రూ. 241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా వివరాలు పొందు పరచిన ఉండవల్లి... సీమెన్స్ ఇండియా గుజరాత్ MOUలో పెట్టిన పేరు సంతకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిన పేరు సంతకం వేరు వేరుగా ఉన్నాయని తన పిల్‌ లో పేర్కొన్నారు.

దురుద్దేశ పూర్వకంగా, కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సహకారంతో 241 కోట్ల దారి మళ్లింపు జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. మొత్తం నిందితుల బైలు ఆర్డర్లలో జస్టిస్ సురేష్ కుమార్ రెడ్డి నిధుల దుర్వినియోగ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తిగా సహకరించాలి అని పేర్కొంటూ, నిందితుల సహకారం లేని పక్షంలో నిందితులకు బెయిల్ రద్దుకు సీబీఐకి అనుమతి ఇచ్చారన్నారు. ఒక్క MOU తప్ప కేసుకి సంబందించిన అన్నీ డాక్యుమెంట్స్ జత చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్... రిమాండ్ ఆర్డర్స్, రిమాండ్ రిపోర్ట్స్ సహ అన్నీ వివరాలు పొందుపరచి 44 మంది ప్రతి వాదులను చేర్చారు.

Tags:
Next Story
Share it