Kovur : కోవూరు బస్టాండ్ లో మృతదేహం కలకలం!

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పంచాయితీ పరిధిలోని ఒక బస్టాండ్ వద్ద మృత దేహం కనపడడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

Kovur : కోవూరు బస్టాండ్ లో మృతదేహం కలకలం!
X

న్యూస్ లైన్, నెల్లూరు : నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పంచాయితీ పరిధిలోని ఒక బస్టాండ్ వద్ద మృత దేహం కనపడడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. పోతిరెడ్డి పాలెం సమీపం లోని ముంబై నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బస్సు షెల్టర్ లో గుర్తు తెలియని వ్యక్తి జీవచ్ఛవం లాగ పడి ఉండడం ని గమనించిన స్థానికులు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ట్రైనీ హేమలత ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోస్టు మార్టం నిమ్మిత్తం మృతి దేహాన్ని కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రాహారాలు లేక చాలా రోజుల నుండి బాస్ షెల్టర్ వద్ద కూర్చొని, నేడు తన తుది శ్వాసని విడిచినట్టుగా అనిపిస్తుంది. పోస్టు మార్టం కి పంపించాము, పూర్తి వివరాలు తెలుస్తాయి అంటూ హేమలత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. మృతుని కుటుంబ సబ్యులకు ఈ సమాచారం ని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారట పోలీసులు.

Tags:
Next Story
Share it