Pawan Kalyan : నేటి నుంచి పవన్ వారాహి యాత్ర..

ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం అయ్యారు.

Pawan Kalyan : నేటి నుంచి పవన్ వారాహి యాత్ర..
X

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేడు మొదలుకానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ నేడు మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 19 వరకు జనసేన మూడో విడత వారాహి యాత్ర కొనసాగించనున్నారు.

ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పర్యటించనున్న పవన్... విశాఖలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలపనున్నారు. వారాహి యాత్రలో భాగంగా జగదాంబ జంక్షన్ లో ఏర్పాటు చేసే సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.

అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళనున్నారు. ఇక యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పవన్ వారాహి యాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. దీంతో ఇవాళ మూడో విడత యాత్ర ప్రారంభం అవుతోంది.

Tags:
Next Story
Share it