Vijayawada : ఆదాయం లో విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు!

విజయవాడ రైల్వే డివిజన్ ఆదాయం పరంగా సరికొత్త రికార్డుని నెలకొల్పింది అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గడిచిన ఆర్ధిక సంవత్సరం లో విజయవాడ నుండి 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందట.

Vijayawada : ఆదాయం లో విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు!
X

న్యూస్ లైన్, విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్ ఆదాయం పరంగా సరికొత్త రికార్డుని నెలకొల్పింది అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గడిచిన ఆర్ధిక సంవత్సరం లో విజయవాడ నుండి 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందట. అందుకు గాను దాదాపుగా 3,975 కోట్ల రూపాయిల రాబడి వచ్చిందని సమాచారం. ఇది ఒక సంచలన రికార్డు గా నిపుణులు పరిగణిస్తున్నారు. గతం లో 2018 నుండి 2019 వార్షిక సంవత్సరం లో 3,875 కోట్ల రూపాయిల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పటి వరకు సంచలన రికార్డు గా పరిగణించారు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలు అయ్యింది. ఇక సరుకు రవాణాలో కృష్ణ పట్నం, కాకినాడ పోర్టులు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా 19.36 మిలియన్ తనుల బొగ్గు, 6.68 మిలియన్ టన్నుల ఎరువులను రవాణా చేసినట్లు గా రైల్వే అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల సమయం లో ఇంత ఉత్పత్తి రవాణా జరగడం ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ గా నిలిచే అంశం.

Tags:
Next Story
Share it