Kesineni Nani : వైసీపీలోకి కేశినేని నాని..జగన్ తో చర్చలు!

కేశినేని నాని త్వరలోనే వైసీపీ లో చేరబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.

Kesineni Nani : వైసీపీలోకి కేశినేని నాని..జగన్ తో చర్చలు!
X

న్యూస్ లైన్ డెస్క్: చాలా కాలం నుండి టీడీపీ సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చిన కేశినేని నాని ఇప్పుడు టీడీపీ పార్టీ ని వదలబోతున్నట్టు శనివారం రోజు మీడియాకి తెలిపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో విజయవాడ ఎంపీ గా గెలుపొందిన కేశినేని నాని త్వరలోనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ని కలిసి తన లోక్ సభ సభ్యత్వం కి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తెలిపాడు. తెలుగు దేశం పార్టీ కి ఇక మీదట నా సేవలు అవసరం లేదని ఆ పార్టీ భావిస్తుంది, అలాంటప్పుడు నాకు ఇక్కడేమి పని అని ఆయన వ్యాఖ్యానించాడు. కేశినేని నాని ని సమర్థిస్తూ వైసీపీ మంత్రులు మరియు కొంతమంది ముఖ్య నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలుగు దేశం పార్టీ వైఖరిని దుయ్యబట్టారు. అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని వదిలేయడం తెలుగు దేశం పార్టీ కి ఇది కొత్తేమి కాదంటూ కామెంట్ చేసారు.

ఇది ఇలా ఉండగా కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అతి త్వరలోనే కేశినేని నాని సీఎం జగన్ సమక్షం లో వైసీపీలో చేరబోతున్నారని టాక్. త్వరలోనే ఆయన జగన్ తో ఈ విషయం పై భేటీ కాబోతున్నాడు. విజయవాడ సెంట్రల్ సీట్ నుండి కేశినేని కి జగన్ ఎమ్యెల్యే టికెట్ ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. టీడీపీ నుండి అసంతృప్తి చెందిన వారు వెంటనే వైసీపీ కి వెళ్లిపోతున్నారు. కానీ వైసీపీ లో సిట్టింగ్ ఎమ్యెల్యేల సీట్ల మార్పిడి అనూహ్యంగా ఈసారి 40 స్థానాలకు జరిగింది. ఎవరో ఒకరిద్దరు తప్ప, టీడీపీ - జనసేన పార్టీల్లోకి ఊహించిన స్థాయిలో చేరికలు జరగడం లేదు. బహుశా టీడీపీ - జనసేన కూటమి లోకి వెళ్తే తమ టికెట్ దక్కదేమో అనే భయం అభ్యర్థుల్లో ఉండడం వల్లే కావొచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:
Next Story
Share it