vijayawada : విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

న్యూస్ లైన్, డెస్క్ : టీవీఎస్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని ఓ కాలనీలోని టీవీఎస్ బైక్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అ

vijayawada : విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
X

న్యూస్ లైన్, డెస్క్ : టీవీఎస్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని ఓ కాలనీలోని టీవీఎస్ బైక్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు.

అయితే అప్పటికే షో రూమ్‌ మొత్తం దగ్ధమయ్యిందని పోలీసులు తెలిపారు. దీంతో షోరూంలోని 300 బైకులు కాలిపోయాయని అన్నారు.. ఒక్కో బైక్ ఖరీధు సుమారు 70 వేల నుంచి 90 వేల వరకు ఉంటుందని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. సర్వీస్ వాహనాలు, కొత్త వాహనాలు కలిపి మొత్తం రూ.8 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని చెప్పారు.

కొత్త వాహనాలకు ఇన్సూరెన్స్ పూర్తిగా వస్తుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లిందని ఎవ్విరికి ఎటువంటి అపాయం జరగలేదని తెలిపారు. అగ్నీ ప్రమాదంపై విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అన్నారు.

Tags:
Next Story
Share it