Perni Nani: డ్రామాలు చేస్తే మక్కెలిరగదీస్తాం.. పవన్‌కు మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

నసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తిపూడి సభలో నిన్న పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)  ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Perni Nani: డ్రామాలు చేస్తే మక్కెలిరగదీస్తాం.. పవన్‌కు మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
X

న్యూస్‌లైన్, డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తిపూడి సభలో నిన్న పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పేర్ని నాని పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పవన్ నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా.. మాకు లేవా చెప్పులు ఉన్నాయన్నారు.

పవన్ సినిమాలను ఎవరు అపుతున్నారని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక పవన్ తీసిన సినిమాలు రెండు మాత్రమేనని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అవాస్తవాలు, బుస మాటలు చెప్పుతున్నారని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నారాహి యాత్రగా మార్చుకోమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ( Chandrababu) అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యూహాలను నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని, ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగుపెడతారని పేర్ని నాని అన్నారు.

Tags:
Next Story
Share it