TTD: పెళ్లి చేసుకోబోతున్నారా.. మీ అడ్రస్ పంపితే టీటీడీ మీకు అవి పంపుతుంది

పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupathi Devasthanam) శుభవార్త అందించింది.

TTD: పెళ్లి చేసుకోబోతున్నారా.. మీ అడ్రస్ పంపితే టీటీడీ మీకు అవి పంపుతుంది
X

TTD: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupathi Devasthanam) శుభవార్త అందించింది. కొత్త జీవితం ప్రారంభించబోతున్న వారికి తిరుమల శ్రీవారి(Balaji) ఆశీస్సులు పొందేందుకు టీటీడీ(TTD) అవకాశం కల్పించింది. నూతన వధూవరులు తమ పూర్తి చిరునామాతో కూడిన పెళ్లి పత్రిక(wedding card)ను పంపితే వారికి శ్రీవారి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, కళ్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాలను తిరుమల దేవస్థానం పంపుతుంది. అప్పట్లో ఈ విధానం అమల్లో ఉండగా కరోనా(carona) కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దీన్ని నిలిపివేసింది. మళ్లీ ఆ కొత్త జంటలకు ఈ అవకాశం కల్పిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన వధూవరులు శ్రీవేంకటేశ్వర స్వామి, ఈఓ ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి 517501 చిరునామాకు తమ శుభాకాంక్షలను తెలియజేయాలని, అలాగే పూర్తి చిరునామాను సరిగ్గా పంపితే టీటీడీ(TTD) నుంచి శ్రీవారి కానుకలు అందుతాయి. నూతన వధూవరులు తమ వివాహ జీవితంలో మొదటి మెట్టుగా కంకణధారణను తీసుకుంటారు. హాని నుండి రక్షణగా బ్యాంగిల్స్ ధరిస్తారు. అలాగే పద్మావతి దేవి ఆశీస్సులతో కుంకుమ, కంకణం సమర్పిస్తారు. నూతన వధూవరులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శ్రీవారి ఆశీస్సులతో టీడీడీ తలంబ్రాలు పంపనుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం పెళ్లికి నెల రోజుల ముందు వెడ్డింగ్ కార్డ్ పంపాలని చెబుతోంది.

Tags:
Next Story
Share it