AP: AP స్మశానానికి నిధులు ఇచ్చిన తెలంగాణ ఎంపీ

ఏపీ ఎలక్షన్లు ( ELECTIONS) వస్తున్నాయి. ఈ టైంలో తెలంగాణ ఎంపీ నిధులు ఇచ్చి ఈ శ్మశాన వాటిక పనులు చేయించడం హాట్ టాపిక్ గా మారింది.

AP: AP స్మశానానికి నిధులు ఇచ్చిన తెలంగాణ ఎంపీ
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మన్యం ( MANYAM JILLA) జిల్లా పార్వతీపురం , సాలూరు( SALURU) లో శ్మశానికి అభివృధ్ధి పనులు జరుగుతున్నాయి . వీటిలో భాగంగా గోడలకు రంగులు వేయడం, కొత్తగా దహనవాటికల , మొక్కలు నాటడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు తెలంగాణ రాష్ట్ర ఎంపీ చేయించడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంపీ నిధులు ఇవ్వడానికి వివాదానికి దారి తీసింది.

సాలూరు దేశంలోనే లారీ ( LORRY INDUSTRY) పరిశ్రమకు పేరు గాంచింది. ఈ ప్రాంతానికి చెందిన పీడిక రాజన్నదొర ఏపీకి ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఏపీ ఎలక్షన్లు ( ELECTIONS) వస్తున్నాయి. ఈ టైంలో తెలంగాణ ఎంపీ నిధులు ఇచ్చి ఈ శ్మశాన వాటిక పనులు చేయించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఎంపీ లు, లీడర్లు , గవర్నమెంట్ ఏం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి 10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్‌లో చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు. ఈ విషయంలో లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృధ్ధి పనులు చెయ్యొచ్చు. అయినా ఇది చిన్న పని ..మంచి పని అందుకే చేశానంటున్నారు లింగయ్య. దీనిలో రాజకీయం లేదని ..తప్పు గా భావించవద్దని అన్నారు.

Tags:
Next Story
Share it