CBN : పేదలంటే ఎందుకు చంద్రబాబు కి అంత పగ?

సంక్షేమ పథకాలు అంటే ఏంటో కూడా తెలియని రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని మరోసారి నిరూపితమైంది.

CBN : పేదలంటే ఎందుకు చంద్రబాబు కి అంత పగ?
X

న్యూస్ లైన్ డెస్క్: సంక్షేమ పథకాలు అంటే ఏంటో కూడా తెలియని రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని మరోసారి నిరూపితమైంది. ఆయన హయాం లో చేసిన సంక్షేమం ఏమిటి అని అడిగితే పట్టుమని రెండు కూడా చెప్పలేని మనిషి. పోనీ ఎవరైనా సంక్షేమం చేస్తే కళ్ళు నిప్పులు పోసుకునే రకం చంద్రబాబు. ముఖ్యంగా వృద్ధుల పట్ల, పేదవారి పట్ల ఏమాత్రం కనికరం, జాలి లేని పాషాణ హృదయం ఉన్నవాడు చంద్రబాబు. అందుకే వృద్దులకు, పేదలకు రావాల్సిన పెన్షన్స్ ని వాలంటీర్ల చేత పంచే కార్యక్రమానికి అడ్డు తగిలాడు. ఒకప్పుడు వృద్దులు పెన్షన్ తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్స్ లో నిల్చొని, నిటారు ఎండల్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోవాల్సిన పరిస్థితి ఉండేది.

కానీ జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత వృద్దులకు, పేదలకు ఇంటి వద్దనే వాలంటీర్ల చేత పెన్షన్స్ ని పంపేవారు జగన్. కానీ ఇప్పుడు చంద్రబాబు కోర్టు లో కేసు వెయ్యడం వల్ల ఎన్నికలు పూర్తి అయ్యి, ఎలక్షన్ కోడ్ ఎత్తివేసేవరకు వాలంటీర్ల చేతులకు సంకెళ్లు పడింది. ఈ రెండు నెలలు వృద్దులు పెన్షన్ తీసుకోవాలంటే ఈ ఎండల్లో క్యూ లైన్స్ లో నిలబడి తీసుకోవాల్సిందే. అలాంటి దుస్థితికి కారణమైన చంద్రబాబు పై వృద్దులు శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకం అని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు. పేదలమీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారు, కానీ ఎన్నికలలో జనాలు యాన్ని చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

Tags:
Next Story
Share it