Minister Roja : అవన్నీ వట్టి పుకార్లే.. ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తా : రోజా

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లో జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా తాను పోటీ చేస్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రకటించారు.

Minister Roja : అవన్నీ వట్టి పుకార్లే.. ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తా : రోజా
X

Minister Roja : పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లో జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా తాను పోటీ చేస్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తన పై అసత్య ప్రచారం జరుగుతుందన్నారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ రోజాకు టికెట్‌ ఇవ్వరని జోరుగా చర్చ కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం జగన్‌ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై మంత్రి రోజా ఎట్టకేలకు స్పందించారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

మంత్రి రోజా మాట్లాడుతూ.. రాబోవు ఎన్నికలో రోజాకు టికెట్‌ రాదని కొంత మంది శునకానందంతో ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. గడపగడపకూ మొదలుకుని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో తానే ఉండటం వారికి కనపడలేదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని ఆమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కే సీట్లు లేకుండా రెండేసి నియోజకవర్గాలలో సర్వేలు చేయించుకుంటున్నారని చురకలంటించారు. తాను జగనన్న సైనికురాలినని, సీఎం జగన్ మాటే తనకు ముఖ్యమన్నారు.

Tags:
Next Story
Share it