TDP : వైసీపీకి షాక్‌...టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు

వైసీపీకి షాక్‌...టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు TDP : వైసీపీకి షాక్‌ ఇచ్చారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.

TDP : వైసీపీకి షాక్‌...టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు
X

TDP : వైసీపీకి షాక్‌ ఇచ్చారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. ఇవాళ హైదరాబాద్‌ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు సమావేశం అయ్యారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతానన్నారు.

బేషరతుగా టీడీపీ పార్టీలో చేరుతానని ఈ సందర్భంగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్న సిద్ధమని... పార్టీ చెబితే గుడివాడ నుంచి అయిన పోటీ చేస్తానని ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని.. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాను....సజ్జల అంటే నాకు గౌరవం ఉండేదని.. ఇప్పుడు పోయిందన్నారు.

చంద్రబాబు దార్శనికుడు, విజన్ ఉన్న నాయకులు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన చంద్రబాబుకు టెక్నాలజీ పై మంచి పట్టు ఉందని.. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉన్నదని వెల్లడించారు. చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడాను. త్వరలోనే పార్టీలో చేరుతానన్నారు యార్లగడ్డ వెంకట్రావు.

Tags:
Next Story
Share it