Ycp: నేటి నుంచి 'సామాజిక సాధికార యాత్ర'

ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి ప్రారంభం అవుతుంది. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తరుణం లో.... వైసీపీ పార్టీ మాత్రం ఎన్నికల పై ఫోకస్

Ycp: నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర
X












Ycp: ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి ప్రారంభం అవుతుంది. చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రాజమండ్రి (rajamundry)సెంట్రల్ జైలులో ఉన్న తరుణం లో.... వైసీపీ పార్టీ (ycp party) మాత్రం ఎన్నికల పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర (ycp party bus yatra ) చేపడుతున్నారు ఆ పార్టీ నేతలు. తొలి దశలో 39 నియోజకవర్గాల్లో ఈ వైసీపీ బస్సు యాత్ర... కొనసాగనుంది. మూడు ప్రాంతాల్లో ఒకేసారి వైసీపీ బస్సు యాత్ర... ప్రారంభం చేస్తున్నారు.



ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం (icchapuram), కోస్తాలో తెనాలి (tenali), రాయలసీమలో సింగనమల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లో మూడు సభలు ఏర్పాటు చేస్తారు. నవంబర్‌ 9తో వైసీపీ బస్సు యాత్ర... ముగియనుంది. 'సామాజిక సాధికార యాత్ర' పై వైసీపీ (ycp party) నేతలు మాట్లాడుతూ.. ఈ యాత్రలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్ (cm jagan) చేసిన మేలును వివరిస్తాం...పేదలందరినీ ఏకం చేసి పెత్తందార్లపై రణభేరీ మోగిస్తామన్నారు.

Tags:
Next Story
Share it