Nellore : నెల్లూరు కి తిరిగి వచ్చేసిన అనిల్ కుమార్ యాదవ్!

నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికలలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించేసారు. ఆయనకీ నర్సారావుపేట జనాలు ఊహించని రీతిలో బ్రహ్మరథం పడుతూ వైసీపీ సత్తా చాటుతున్నారు.

Nellore : నెల్లూరు కి తిరిగి వచ్చేసిన అనిల్ కుమార్ యాదవ్!
X

న్యూస్ లైన్, నెల్లూరు : నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికలలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించేసారు. ఆయనకీ నర్సారావుపేట జనాలు ఊహించని రీతిలో బ్రహ్మరథం పడుతూ వైసీపీ సత్తా చాటుతున్నారు. చూస్తూ ఉంటే ఈ స్థానం నుండి అనిల్ కుమార్ యాదవ్ కచ్చితంగా గెలుస్తాడని అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే నేడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు కి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ 'వైసీపీ లో ఉన్న నాయకులను, కార్యకర్తలను టీడీపీ జనసేన వారు తమ పార్టీల్లో చేరమని బెదిరిస్తున్నట్టు నాకు సమాచారం అందింది. నేను నర్సరావుపేట కి వెళ్ళిపోయాను కాబట్టి, ఏమైనా చేసేయొచ్చు అనుకున్నారేమో. నేను ఎక్కడ ఉన్నా నా కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటాను. బెదిరించాలని చూస్తే తోలుతీస్తా జాగ్రత్త' అంటూ అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:
Next Story
Share it