YCP : వైసీపీ 6వ విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల!

రాబొయ్యే సార్వత్రిక ఎన్నికల కోసం సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక ని చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. ఇప్పటికే 5 విడతలుగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేజేసిన సీఎం జగన్, ఇప్పుడు ఆరవ విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసాడు.

YCP :  వైసీపీ 6వ విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల!
X

న్యూస్ లైన్, అమరావతి : రాబొయ్యే సార్వత్రిక ఎన్నికల కోసం సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక ని చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. ఇప్పటికే 5 విడతలుగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేజేసిన సీఎం జగన్, ఇప్పుడు ఆరవ విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసాడు. ఈ జాబితా లో వైసీపీ క్యాడర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నెల్లూరు సిటీ ఎమ్యెల్యే అభ్యర్థి ఎవరో ఖరారు అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసారావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తుండగా, ఈసారి నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ కచ్చితంగా వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి కి వస్తుందని ఆశించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నెల్లూరు నగర మేయర్ ఎండీ.ఖలీల్ కి సీటుని కేటాయించాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశ అయ్యింది. ఈ జాబితాలో కూడా సీఎం జగన్ ఎక్కువగా బీసీ సామజిక వర్గానికే పెద్ద పీట వేసాడు.

ఇక మిగిలిన 9 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాని ఒకసారి చూస్తే రాజమండ్రి ఎంపీ స్థానం కి గుడారి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ స్థానం కి అడ్వకేట్ గుడారి ఉమాబాలా,గుంటూరు ఎంపీ స్థానం కి ఉమ్మారెడ్డి వెంకట రమణ, చిత్తూరు ఎంపీ స్థానం కి ఎన్ .రెడ్డప్ప లకు కేటాయించాడు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాకు వస్తే మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అన్నా రాంబాబు, గిద్దలూరు స్థానం కి నాగార్జున రెడ్డి, జీడీ నెల్లూరు స్థానం కి నారాయణస్వామి, ఎమ్మిగనూరు స్థానం కి బుట్టా రేణుకకు కేటాయించాడు. ఇది ఇలా ఉండగా ఎన్.రెడ్డప్ప ని తొలుత జీడీ నెల్లూరు స్థానం కి కేటాయించిన జగన్, కొన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయన్ని చిత్తూరు ఎంపీ స్థానం కి షిఫ్ట్ చేసి, నారాయణ స్వామి కి జీడీ నెల్లూరు సీటు ని కేటాయించాడు.

Tags:
Next Story
Share it