Cm Jagan : డ్వాక్రా రుణాలపై ఎల్లో మీడియా విష ప్రచారం..అసలు వాస్తవాలు ఇవే!

తన ఎల్లో మీడియా తో డ్వాక్రా రుణాల మాఫీ మీద చంద్రబాబు నాయుడు విష ప్రచారం.

Cm Jagan : డ్వాక్రా రుణాలపై ఎల్లో మీడియా విష ప్రచారం..అసలు వాస్తవాలు ఇవే!
X

న్యూస్ లైన్ డెస్క్: తాము చెయ్యరు, చేసేవాళ్ళు ఉంటే చూస్తూ ఊరుకోలేరు అనడానికి ఉదాహరణగా చంద్రబాబు ని అతని మీడియా ని చూపించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, సంక్షేమ పధకాలను అమలు చేసినా, చూసి తట్టుకోలేరు. ఎందుకంటే వాటి వల్ల జగన్ కి ఎక్కడ జనాల్లో ఆదరణ పెరిగిపోతుందో, మళ్ళీ ఎక్కడ అధికారం లోకి వస్తాడో అనే భయం. ఇప్పుడు తాజాగా డ్వాక్రా మహిళల గురించి ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాలను చూసి ఛీ కొడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తన హయాం లో చంద్రబాబు డ్వాక్రా సంఘాలను నట్టేట ముంచితే సీఎం జగన్ అధికారం లోకి రాగానే ఆ సంఘాలను ఆదుకున్నాడు. అందులో కొన్ని ఇప్పుడు మనం చూద్దాము.

డ్వాక్రా సంఘాల అప్పులను అధికారం లోకి రాగానే మాఫీ చేస్తాను అని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ మాటని గాలికి వదిలేసాడు. 2014 వ సంవత్సరం లో 14 వేల కోట్ల అప్పు ఉంటే, అది 2019 వ సంవత్సరం కి వడ్డీలు పెరిగి 25,571 కోట్లు అయ్యాయి. కానీ చంద్రబాబు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ సీఎం జగన్ 'వై ఎస్ ఆర్ ఆసరా' పథకం ద్వారా నాలుగు విడతల్లో మహిళలకు చెల్లిస్తూ వస్తున్నారు. 2019 వ సంవత్సరం నాటికి 25,571 కోట్లు అప్పు ఉంటే , మూడేళ్ళలో దాదాపుగా 19,178 అప్పుని చెల్లించింది. నాల్గవ విడత ఈ నెలలోనే ఇవ్వబోతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నరోజుల నుండి కొనసాగుతూ వచ్చిన పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు తన హయాం లో మంగళం పాడాడు.2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. కానీ జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పధకాన్ని తిరిగి ప్రారంభించాడు. గడిచిన నాలుగేళ్లలో సకాలం లో రుణాలను చెల్లిస్తూ వచ్చిన మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేసారు. డ్వాక్రా మహిళలకు ఇంత మేలు చేస్తే, దానిపై కూడా విష ప్రచారం చెయ్యాలని చూసిన ఎల్లో మీడియా కి మరియు చంద్రబాబు నాయుడు కి మరో మూడు నెలలో ఓటు రూపం లో బుద్ధి చెప్తాము అంటూ డ్వాక్రా మహిళలు అంటున్నారు.

Tags:
Next Story
Share it