Sharmila : పవన్ కళ్యాణ్ తో వై ఎస్ షర్మిల భేటీ!

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అద్యక్ష్యురాలు వై ఎస్ షర్మిల నేడు హైదరాబాద్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. తన కొడుకు రాజా రెడ్డి , ప్రియా అట్లూరి పెళ్ళికి ఆమె ఆహ్వానించినట్టుగా సమాచారం.

Sharmila : పవన్ కళ్యాణ్ తో వై ఎస్ షర్మిల భేటీ!
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అద్యక్ష్యురాలు వై ఎస్ షర్మిల నేడు హైదరాబాద్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. తన కొడుకు రాజా రెడ్డి , ప్రియా అట్లూరి పెళ్ళికి ఆమె ఆహ్వానించినట్టుగా సమాచారం. ఈ మేరకు కొడుకు రాజారెడ్డి, ప్రియా అట్లూరి గురించి వివరాలను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అద్యక్ష్యురాలిగా నియమితులు అయ్యినందుకు షర్మిలకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేసాడు పవన్ కళ్యాణ్.

జనవరి 18 వ తారీఖున రాజా రెడ్డి , ప్రియా అట్లూరి నిశ్చితార్థం హైదరాబాద్ లో జరగనుంది. వీళ్లిద్దరి పెళ్లి ఫిబ్రవరి 17 వ తారీఖున రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో బందు మిత్రుల సమక్ష్యం లో వివాహం జరగనుంది. ఈ పెళ్ళికి షర్మిల ఆహ్వానించినా రాజకీయ నాయకులు వస్తారో లేదో తెలియదు కానీ పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరగబొయ్యే వెడ్డింగ్ రిసెప్షన్ కి మాత్రం అందరూ కచ్చితంగా హాజరు అవుతారు. వీళ్లిద్దరి పెళ్లి క్రైస్తవ మత పద్దతిలోనే జరగబోతుంది అట. అందరి కంటే ముందుగా ఇడుపులపాయలోని వై ఎస్ ఆర్ సమాధి వద్ద మొదటి శుభలేఖ ని పెట్టిన షర్మిల, రెండవ శుభలేఖ తన సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించింది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వాన పత్రిక ని అందచేసిన షర్మిల, నేడు పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించింది.

జనవరి 18న రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఫిబ్రవరి 17న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుంది. అనంతరం జరగనున్న వెడ్డింగ్ రిసెప్షన్ కోసం షర్మిల రాజకీయ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.

ఈ క్రమంలో తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు శుభలేఖ అందించిన షర్మిల.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులకు ఇన్విటేషన్ అందించారు. చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె పచ్చ రంగు చీరలో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిల.. తన కొడుకు ఎంగేజ్‌మెంట్ తర్వాత పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ చీఫ్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తండ్రీ కూతుళ్లిద్దరూ పీసీసీ చీఫ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర పార్టీల్లో, ముఖ్యంగా వైఎస్సార్సీపీలో టికెట్లు దక్కని నేతలు హస్తం గూటికి చేరే అవకాశం ఉంది.

Tags:
Next Story
Share it