Ys Sharmila : చంద్రబాబు తో షర్మిల భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) వైఎస్‌ షర్మిల (Ys Sharmila) కలిశారు. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును

Ys Sharmila : చంద్రబాబు తో షర్మిల భేటీ
X

Ys Sharmila : టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) వైఎస్‌ షర్మిల (Ys Sharmila) కలిశారు. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును ఆయన నివాసంలో వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు షర్మిల.

ఇటీవలే వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో సెటిల్ అయిన ఓ అమ్మాయిని రాజారెడ్డి (raja reddy)ప్రేమించాడు. ఇక వీరి ప్రేమకు షర్మిల కుటుంబం ఒప్పుకుంది. పెళ్లి కూడా ఫిక్స్ చేసింది. దీంతో తన కుమారుడి పెళ్లి కార్డు పట్టుకొని, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు వైఎస్ షర్మిల (Ys Sharmila). ఇందులో భాగంగానే ఇవాళ చంద్రబాబును ఆయన నివాసంలో వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు.

Tags:
Next Story
Share it