YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని జగన్ !

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇంట పెళ్లి భజాలు మోగాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (Ys Sharmila) కుమారుడు రాజారెడ్డి, అట్లూరి

YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని జగన్ !
X

Ys Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (Ys Sharmila) ఇంట పెళ్లి భజాలు మోగాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (Ys Sharmila) కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అది కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఈ సందర్భంగా కుమారుడు రాజారెడ్డి (Raja reddy), కోడలు ప్రియకు కంగ్రాట్స్ చెప్పారు షర్మిల. అలాగే పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాలు వేడుక జరగనుంది. కాగా, ఈ వివాహ వేడుకలకు షర్మిల (Ys Sharmila) సోదరుడు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Cm jagan) దూరంగా ఉన్నారు. ఇక ఆదివారం అంటే ఇవాళ క్రైస్తవ సంప్రదాయంలో జరిగే పెళ్లికి అయినా జగన్ వస్తారో లేదో వేచి చూడాలి.

Tags:
Next Story
Share it