Ap Congress: షర్మిలతో భేటీ అయిన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత!

షర్మిల నేడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ని కలిసిన సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ లో కలుసుకొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

Ap Congress: షర్మిలతో భేటీ అయిన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత!
X

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణాలో పార్టీ ని స్థాపించి పోటీ చెయ్యకుండానే కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టి పోటీ చెయ్యబోతుంది. ఇప్పటికే సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మీద అనేక ఆరోపణలు చేసిన షర్మిల పై వైసీపీ నేతలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా షర్మిల అవకాశవాద రాజకీయాలు చేస్తుంది అంటూ పెదవి విరుస్తున్న ఈ నేపథ్యంలో, షర్మిల నేడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ని కలిసిన సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ లో కలుసుకొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సునీత అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కలిసి వై ఎస్ వివేకా హత్య కేసు ని అడ్డం పెట్టుకొని చీప్ రాజకీయాలు చెయ్యబోతున్నారు అంటూ వైసీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.

Tags:
Next Story
Share it