YS Viveka case: వివేక కేసులో బిగ్ ట్విస్ట్..!

YS Viveka case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ** కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

YS Viveka case: వివేక కేసులో బిగ్ ట్విస్ట్..!
X

YS Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ** కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.బి.ఐ) ఇటీవల ఓ చార్జ్ షీట్ ని కోర్టులో సమర్పించింది. అయితే వివేకా హ** కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ని టెక్నికల్ తప్పిదాల కారణంగా వెనక్కి పంపింది సి.బి.ఐ కోర్ట్. దీంతో అందులోని తప్పులను సవరించి మళ్లీ ఓ ఛార్జ్ షీట్ ని రీ సబ్మిట్ చేసింది సిబిఐ. ఈ ఏడాది జూన్ 30వ తేదీన సప్లమెంటరీ చార్జీ షీట్ ని సిబిఐ కోర్టులో దాఖలు చేసింది.

ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని ఎనిమిదవ నిందితుడిగా పేర్కొంది. అయితే ఇందులో కొన్ని సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి పంపగా సిబిఐ వాటిని సరిచేసి మళ్లీ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. ఇక నేడు హైకోర్టులో దస్తగిరి అప్రూవర్ పై వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ తరుణంలో చార్జిషీట్ రీ సబ్మిట్ చేసినట్టు హైకోర్టుకి తెలిపింది సీబీఐ. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హై కోర్ట్. 2019 మార్చి 14వ తేదీన మాజీ మంత్రిపై వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ కేసులో ఇప్పటివరకు అసలు దోషులు ఎవరో తెలియ రాలేదు.

Tags:
Next Story
Share it