YS Viveka murder case update: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై చార్జిషీట్.. ఏ-8 గా పేర్కొన్న సీబీఐ

YS Viveka murder case update: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది.

YS Viveka murder case update: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై చార్జిషీట్.. ఏ-8 గా పేర్కొన్న సీబీఐ
X

YS Viveka murder case update: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో ఏ-6 గా ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ-7 గా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఏ-8 గా వైఎస్ అవినాష్ రెడ్డిలను పేర్కొంది సి.బి.ఐ. వివేకా హత్యకు కుట్ర, సాక్షాల చెరిపివేతలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని ఛార్జ్ షీట్ లో వివరించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో సిట్ అరెస్టు చేసిన ఎంవీ కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాష్ ను అనుమానితులుగా ప్రస్తావించింది సిబిఐ.

ఈ కేసులో నిందితులు శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ శంకర్ రెడ్డి చంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక జూన్ 30లోగా వివేకా హత్య కేసులో దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఇప్పటివరకు నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను జతచేసింది. ఇక సిబిఐ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత విచారణ నిమిత్తం న్యాయస్థానం నిందితులకు సమన్లు జారీ చేయనుంది.

Tags:
Next Story
Share it