CM JAGAN : నేడు వైఎస్సార్ వాహన మిత్ర నిధుల విడుదల

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. వైఎస్సార్ వాహన మిత్ర నిధులను ఇవాళ రిలీజ్‌ చేయనుంది జగన్‌ సర్కార్‌. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర నిధులను ఇవాళ రిలీజ్‌ చేయనుంది జగన్‌ సర్కార్‌. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎమ్‌డీయూ ఆపరేటర్లు ఒక్కొక్కరికి రూ.

CM JAGAN : నేడు వైఎస్సార్ వాహన మిత్ర నిధుల విడుదల
X

CM JAGAN : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. వైఎస్సార్ వాహన మిత్ర నిధులను ఇవాళ రిలీజ్‌ చేయనుంది జగన్‌ సర్కార్‌. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర నిధులను ఇవాళ రిలీజ్‌ చేయనుంది జగన్‌ సర్కార్‌. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎమ్‌డీయూ ఆపరేటర్లు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తోంది.

ఇక ఈ పథకం కారణంగా 2,75,931 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. దీని కోసం 275.93 కోట్ల ఆర్థిక సహాయం చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగానే... ఇవాళ విజయవాడ విద్యాధరపురంలో వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వై.ఎస్. జగన్. ఈ కార్యక్రమం ఇవాళ ఉదయం 10.30 గంటలకు జరుగనుండగా... ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఇప్పటి వరకు 1302 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.

Tags:
Next Story
Share it