Nellore : పెంచలకోన జలపాతంలో 11 మంది గల్లంతు

నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. మొత్తం పదకొండు మంది గల్లంతైనట్లు సమాచారం.

Nellore : పెంచలకోన జలపాతంలో 11 మంది గల్లంతు
X

Nellore : నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. మొత్తం పదకొండు మంది గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 11 మంది పర్యాటకులు వరదలో కొట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అందుతున్న సమాచారం మేరకు పోలీసులు వారి కోసం తాళ్లతో గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

పెంచలకోన జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన పర్యాటకులు నీటి ఉధృతికి అందులో పడి గల్లంతైనట్లు సమాచారం. అయితే వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. వీరిలో మహిళలు కూడా ఉన్నట్లు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. నీటిలో మునిగిన వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మరికొందరు వరద ఉధృతికి కొట్టుకుపోయారని మరో కథనం చెబుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it