Cm Ramesh : కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ రూ.30 కోట్ల విరాళం

ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలెక్టోరల్ బాండ్స్ (ఫండ్స్) ని అధికారిక వెబ్ సైట్ ప్రజలకు అందుబాటులో పెట్టడం ద్వారా, వివిధ సంస్థల ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు వచ్చే ఫండ్స్ కి సంబంధించిన వివరాలు మొత్తం జనాలకు తెలుస్తున్నాయి.

Cm Ramesh : కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ రూ.30 కోట్ల విరాళం
X

న్యూస్ లైన్ డెస్క్ : ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలెక్టోరల్ బాండ్స్ (ఫండ్స్) ని అధికారిక వెబ్ సైట్ ప్రజలకు అందుబాటులో పెట్టడం ద్వారా, వివిధ సంస్థల ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు వచ్చే ఫండ్స్ కి సంబంధించిన వివరాలు మొత్తం జనాలకు తెలుస్తున్నాయి. దీని ద్వారా రాజకీయ పార్టీలకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో బట్టబయలు అవుతున్నాయి. రీసెంట్ గా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కి సంబంధించిన కొన్ని షాకింగ్ వివరాలు బయటపడి అవి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకులలో ముఖ్యులు అయిన సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీ కి 30 కోట్ల రూపాయిలు విరాళం అందించినట్టు ఎలెక్టోరల్ బాండ్ లో తేలింది. దీంతో ఒక బీజేపీ ఎంపీ కి కాంగ్రెస్కు విరాళం ఎందుకు అందించారు అనేది ఇప్పుడు పెద్ద తికమక రేపుతున్న ప్రశ్న.

సీఎం రమేష్ మొదటి నుండి తెలుగుదేశం పార్టీ లో కొనసాగుతూ వచ్చారు. 2019 లో ఆ పార్టీ ఓడిపోయాక చంద్రబాబు పై కేసులు రాకుండా బీజేపీని ఒప్పించేందుకు సీఎం రమేష్ ఆ పార్టీ లో చేరారు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు నాయుడు హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో జరిగిన ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంతే కాకుండా వై ఎస్ షర్మిల ని కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీ ని విలీనం చేసేలా చేసింది కూడా చంద్రబాబే. సీఎం జగన్ ని రాబొయ్యే ఎన్నికలలో ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తో పరోక్షంగా, బీజేపీ, జనసేన పార్టీలతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు అనేది స్పష్టం గా అందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ లో చంద్రబాబు మనిషి గా వ్యవహరిస్తూ వచ్చిన సీఎం రమేష్, కాంగ్రెస్ పార్టీ కి 30 కోట్లు విరాళం ఇవ్వడం కూడా అందుకు ఒక ఉదాహరణ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:
Next Story
Share it