Chandrababu Naidu : దళిత ద్రోహి చంద్రబాబు అనడానికి ఇదే నిదర్శనం!

దళిత నేతని మీడియా ముందు అవమానపర్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Chandrababu Naidu : దళిత ద్రోహి చంద్రబాబు అనడానికి ఇదే నిదర్శనం!
X

న్యూస్ లైన్, చిత్తూరు : దళితుల పట్ల టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఎంత చులకన భావం ఉందో మరోసారి నిరూపితం అయ్యింది. ఆయన హయాంలో దళితులకు చేసిన మేలు ఏమి లేదు. కనీసం రాబోయే ఎన్నికలలో దళితులకు ఎక్కువ శాతం అసెంబ్లీ సీట్లు ఇస్తున్నాడా అంటే అది కూడా లేదు. దళితులను కేవలం ఒక ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఆయన చూస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఇప్పటికైనా ఆయనకీ దళితుల పట్ల చులకన భావం తొలగిందేమో అని అనుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఉదాహారానికి చంద్రబాబు రీసెంట్ గా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ ఆయన చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నాని ఇంట్లో ఆతిధ్యం తీసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ పలువురు టీడీపీ ముఖ్యనేతలు, ఎమ్యెల్యేలు హాజరయ్యారు. వారిలో నాలుగుసార్లు ఎమ్యెల్యే గా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన దళిత నేత పరసరత్నం కూడా ఉన్నారు. ముఖ్య నాయకులందరూ ప్రెస్ ముందు కూర్చోగా, పరసారత్నం ని మాత్రం మూలాన నిల్చోబెట్టారు. ఇది ఆయన అనుచరులకు ఏమాత్రం నచ్చలేదు. చంద్రబాబు నాయుడికి దళితులు అంటే చులకన భావం ఇంకా పోలేదని, రాబోయే ఎన్నికలలో ఇది గుర్తించి చంద్రబాబు నాయుడుని దళితులందరు ఓడించాలని దళిత సంఘాలకు చెందిన నేతలు పిలుపునిచ్చారు.

Tags:
Next Story
Share it