TDP : ఆ నేత భవిష్యత్తుని నాశనం చేసిన చంద్రబాబు!

కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించి తెలుగు వాడి ఆత్మగౌరవం ని దేశం మొత్తానికి తెలియచేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఆనాడు ఎన్టీఆర్ నిలిపారు.

TDP : ఆ నేత భవిష్యత్తుని నాశనం చేసిన చంద్రబాబు!
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించి తెలుగు వాడి ఆత్మగౌరవం ని దేశం మొత్తానికి తెలియచేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఆనాడు ఎన్టీఆర్ నిలిపారు. కానీ ఎప్పుడైతే ఆ పార్టీ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు కి చేతులు మారిందో అప్పటి నుండి దిగజారుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఢిల్లీ పెద్దల ముందు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం చంద్రబాబు కి కొత్తేమి కాదు. ఇప్పుడు కూడా మరోసారి అదే చేసారు. ఆంధ్ర ప్రదేశ్ సున్నా ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకోవడమే దండగ అని టీడీపీ క్యాడర్ అనుకుంటుంటే, బీజేపీ కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి అన్నట్టుగా వాళ్ళు ఎన్ని సీట్లు కోరితే అన్ని సీట్లు ఇచ్చేస్తుంది టీడీపీ. ఇప్పటికే 10 ఎమ్మెల్యే, ఆరు ఎంపీ స్థానాలను బీజేపీ కి కేటాయించిన టీడీపీ, ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే స్థానం కూడా బీజేపీ కే కేటాయించనున్నారని తెలుస్తుంది. ఈ స్థానం నుండి నర్సాపురం ప్రస్తుతం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పోటీ చేస్తారట. నరసాపురం ఎంపీ స్థానం ని ఆశించిన రఘురామ కి చుక్కెదురు అవ్వడం తో, పొత్తుని నమ్ముకున్న నాకు సీటు ఇప్పించే బాధ్యత టీడీపీ, జనసేనదే అని ఆయన మొండిపట్టు పట్టడం తో నర్సాపురం ఎంపీ స్థానం ని రఘురామ కృష్ణం రాజు కి కేటాయించాల్సిందిగా చంద్రబాబు బీజేపీ ని కోరారు.

మా పార్టీ నుండి అతను పోటీ చెయ్యడానికి ఆంధ్రా బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు, మేము ఇవ్వలేము అని బీజేపీ తేల్చి చెప్పడం తో, పోనీ ఆ స్థానం మాకే కేటాయించండి, మా పార్టీ గుర్తుతో రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారు,మీకు నర్సాపురం ఎంపీ కి బదులుగా కడప ఎంపీ స్థానం ఇస్తామని చంద్రబాబు ఒక ఆఫర్ పెట్టారు. దీనికి బీజేపీ ఒప్పుకోలేదట. వాళ్ళు చంద్రబాబు కి ఒకే ఒక్క అవకాశం ఇచ్చారట. రఘురామ కృష్ణం రాజు ని తమ పార్టీ నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని, కానీ అదనంగా ఉండి ఎమ్మెల్యే స్థానం కావాలని, ఆ స్థానం నుండే రఘు రామ కృష్ణంరాజు పోటీ చేస్తారని చెప్పారట. దీంతో చంద్రబాబు కి మరో దారి లేక ఉండి ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ కి కేటాయించినట్టు తెలుస్తుంది. తెలుగు దేశం పార్టీ కి కంచుకోట లాంటి స్థానం ఉండి నియోజకవర్గం. 2019 ఎన్నికలలో జగన్ సునామీ లో కూడా ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు గెలుపొందారు. ఇప్పటి వరకు ప్రకటించిన టీడీపీ 144 స్థానాల్లో మంతెన రామరాజు కి సీట్ ని కేటాయించారు. ఇప్పుడు కేటాయించిన ఆ సీటుని వెనక్కి తీసుకొని బీజేపీ కి ఇచ్చేసారు చంద్రబాబు. ఇది దిగజారడం లో మరో లెవెల్ అని అంటున్నారు టీడీపీ క్యాడర్. తన సొంత కష్టం తో టీడీపీ కి ఉండి నియోజకవర్గాన్ని కంచుకోట లాగ మల్చిన మంతెన రామరాజు కి ఇంతటి అన్యాయమా?, ఒక్క శాతం ఓటు బ్యాంక్ లేని బీజేపీ కోసం రామరాజు రాజకీయ భవిష్యత్తు ని నాశనం చేస్తారా?, ఇదెక్కడి పనికిమాలిన రాజకీయం అంటూ టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తున్నారు.

Tags:
Next Story
Share it