Vijayawada : విజయవాడలో ఎల్లుండి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.!

బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అంబెడ్కర్ ని స్మరించుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి విజయవాడ లో బీఆర్ అంబేకర్ విగ్రహాన్ని ఎల్లుండి (శుక్రవారం) ఆవిష్కరించబోతున్నారు.

Vijayawada : విజయవాడలో ఎల్లుండి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.!
X

న్యూస్ లైన్ , విజయవాడ : బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అంబేడ్కర్‌ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించబోతోంది జగన్ సర్కార్. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు, మంత్రులు పోస్టర్‌ని అధికారికంగా బుధవారం విడుదల చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం 'సామాజిక సమతా సంకల్పం' అనే పేరుతో భారీ బహిరంగ సభని ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఈ సభలో సీఎం జగన్ పలు కీలక అంశాలపై మాట్లాడతారు. అంబేడ్కర్ ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్తున్న వ్యక్తి జగన్ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడని, రాబోయే ఎన్నికలలో కూడా ఈ రెండు వర్గాలు జగన్ వైపే ఉంటాయన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం మంత్రులు, ఎమ్యెల్యేలు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. 125 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం, ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహాలలో ఒకటిగా నిలవబోతుంది.


Tags:
Next Story
Share it